తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర, అభ్యంతరకరమైన మాటలకు హీరోయిన్ సమంత, నాగార్జున కుటుంబమే కాదు మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్పందిస్తోంది. సమంత విడాకులకు ప్రధాన కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్తూ కొండా సురేఖ చేసిన జుగుప్సాకరమైన ఆరోపణలకు తెలుగు చిత్రసీమ ముక్తకంఠంతో జవాబు ఇస్తోంది. ఆమె వ్యాఖ్యలను హీరోలు అందరూ తప్పు పడుతున్నారు.
ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్, చిరంజీవి, నాని, అల్లు అర్జున్, వెంకటేష్, సుధీర్ బాబు, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, మంచు విష్ణు, రామ్ గోపాల్ వర్మ, ఝాన్సీ, లావణ్య, …ఇలా అందరూ వరుసగా ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు.
సమంతకి పూర్తిగా మద్దతు తెలిపారు.
అక్కినేని కుటుంబం మొత్తం షాక్ లో ఉంది. సురేఖ మాటలు ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేశాయి. సమంత, నాగార్జున, కొంచెం ఆచితూచి స్పందించారు. కానీ అమల ఏకంగా కొండా సురేఖను క్రిమినల్ అని కూడా వ్యాఖ్యనించారు. ఆమె రాహుల్ గాంధీకి ట్యాగ్ చెయ్యడం విశేషం.