
టాలీవుడ్ హీరోలు చాలామందికి ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ కామన్ అయిపోయింది. స్టార్ హీరోల నుంచి తేజ సజ్జా లాంటి కుర్ర హీరోల వరకు చాలామంది ఈ క్లబ్ లో ఉన్నారు. అందుకే ఇప్పుడు 5 మిలియన్ డాలర్ క్లబ్ అనేది ప్రతిష్టాత్మకంగా మారింది.
మొన్నటివరకు రాజమౌళి సినిమాలు, ఆ హీరోలు మాత్రమే ఇందులో ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ కూడా సోలో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి
5 మిలియన్ డాలర్ క్లబ్ లో ప్రభాస్ వి 4 సినిమాలున్నాయి. బాహుబలి 1, బాహుబలి 2, సలార్ సినిమాలతో పాటు తాజాగా కల్కి సినిమా కూడా లిస్ట్ లో చేరింది.
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ క్లబ్ లో జాయింట్ గా చేరారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఎన్టీఆర్ నుంచి రెండో సినిమా వచ్చి చేరింది. ఆర్ఆర్ఆర్ తో పాటు, దేవర సినిమాను కలిగి ఉన్నాడు తారక్. త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్ కూడా 5 మిలియన్ డాలర్ క్లబ్ లోకి రెండో సినిమాను చేర్చడం ఖాయం.
ఈ లిస్ట్ లో తేజ సజ్జా కూడా ఉన్నాడు. అతడు నటించిన హనుమాన్ సినిమా 5 మిలియన్ డాలర్ క్లబ్ లో ఉంది. ఇలా టాలీవుడ్ నుంచి నలుగురు హీరోలు 5 మిలియన్ డాలర్ క్లబ్ లో ఉండగా, వీళ్లలో ప్రభాస్ టాప్ లో ఉన్నాడు.
టాప్ చిత్రాలు ఇవే
బాహుబలి 2 – $20 మిలియన్ డాలర్లు
కల్కి 2898 AD – $18.5 మిలియన్ డాలర్లు
RRR – $15 మిలియన్ డాలర్లు
సలార్ – $8.9 మిలియన్ డాలర్లు
బాహుబలి – $8.9 మిలియన్ డాలర్లు
దేవర – $8.9 మిలియన్ డాలర్లు
హనుమాన్ – $5.2 మిలియన్ డాలర్లు