హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది. వరుసపెట్టి సినిమాలు చేస్తారు, సడెన్ గా మాయమౌతారు. గట్టిగా ఐదేళ్లు నిలబడిన హీరోయిన్లకు వేళ్లపై లెక్కబెట్టొచ్చు. ఇవన్నీ తనకు తెలుసని, అందుకే తను వాస్తవంలో బతుకుతానని చెబుతోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి.
కెరీర్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ బ్యూటీ.. ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యం కాదని, ఎంతమందిని ఆకట్టుకున్నామనేది ఇంపార్టెంట్ అంటోంది.
కెరీర్ ప్రారంభించిన తక్కువ టైమ్ లోనే తెలుగులో మహేష్ బాబు, తమిళ్ లో విజయ్ లాంటి హీరోల సరసన నటించిన ఈ చిన్నది.. అవకాశాలు వస్తున్నప్పుడే అందిపుచ్చుకోవాలని చెబుతోంది. కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్న తను విశ్రాంతి సమయాన్ని తగ్గించుకున్నానని, వీలైనన్ని ఎక్కువ సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తున్నానని చెబుతోంది. కెరీర్ పై తనకు ఎలాంటి బెంగలేదంటున్న ఈ బ్యూటీ.. ఎప్పటికైనా సైకాలజిస్ట్ గా స్థిరపడాలనేది తన కోరికగా చెప్పుకొచ్చింది.
విశ్వక్ తో కలిసి ఆమె నటించిన “మెకానిక్ రాకీ” సినిమా దీపావళికి రిలీజ్ అవుతుంది. అలాగే వచ్చే నెల వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న “మట్కా” కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో ఆమె ఈ నెల బిజీగా ఉంటుంది.