గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కినేని నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేసింది అనే మాట వినిపిస్తోంది. దానికి తగ్గట్లే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు. అలాగే, ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండ సురేఖ ప్రతిపక్ష పార్టీ నేతపై విమర్శలు చేస్తున్నట్లుగా మాట్లాడుతూ నాగార్జున కుటుంబంపై దారుణమైన, అసభ్యకరమైన ఆరోపణలు చేశారు.
ఐతే, ఈ విషయంలో నాగార్జున సైలెంట్ గా ఉండకుండా న్యాయ పోరాటానికి దిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకన్నా తనని టార్గెట్ చేసేది లేదని ఫిక్స్ అయి గట్టిగా పోరాడేందుకు సిద్ధపడ్డారు.
ఇప్పటికే అమల కొండా సురేఖని ఒక క్రిమినల్ గా అభివర్ణించగా, నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు. కానీ తన భయపడను అని గట్టి సందేశం పంపే ప్రయత్నం చేస్తున్నారు నాగార్జున.
నాగార్జున కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది అన్న విషయంలో రాజకీయ విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాగార్జునని టార్గెట్ చేసిందా లేదా అన్నది పక్కన పెడితే, నాగార్జున మాత్రం తగ్గేది లేదు అని అంటున్నారు.