సెలబ్రిటీలు ధరించే దుస్తులు, వాడే యాక్ససిరీస్ లక్షల్లో ఉంటాయి. కొంతమంది హీరోలు వాడే యాక్ససిరీస్ కోట్లలో కూడా ఉంటాయి. అలాంటి ఓ ఖరీదైన వస్తువుతో దర్శనమిచ్చింది హీరోయిన్ సమంత. ఐఫా అవార్డుల వేడుకలో సమంత ధరించిన వాచీ హాట్ టాపిక్ గా మారింది.
బుల్గరీ బ్రాండ్ కు చెందిన ఈ వాచీ ఖరీదు అక్షరాలా 45 లక్షల రూపాయలు. ఫొటోషూట్స్ లో ఈ వాచీ ప్రధాన ఆకర్షణగా మారింది. కాస్ట్ లీ దుస్తులు వాడడం సమంతకు కొత్త కాదు. కొన్నిసార్లు ఆమె ధరించే గార్మెంట్స్ లక్షల్లో ఉంటాయి. అయితే ఇలా ఖరీదైన యాక్ససిరీస్ లో మాత్రం ఆమె చాలా తక్కువగా కనిపిస్తుంది.
మొన్నటివరకు ఆమె హెల్త్ టిప్స్ తో సోషల్ మీడియాలో ఎక్కువగా పలకరించేది. ఇప్పుడు మాత్రం ఆమె ఒక్కసారిగా యాక్టివ్ అయింది. వరుసగా ఫొటోషూట్స్ చేస్తూ, ఆ స్టిల్స్ ను ఇనస్టాలో పోస్ట్ చేస్తోంది. అంతేకాకుండా, ఆమె తిరిగి తన ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా బిజీ అయింది.
సిటాడెల్- హనీబన్నీ సిరీస్ ప్రచారాన్ని మరోసారి ప్రారంభించింది సమంత. త్వరలోనే ఆమె తన సినిమా విశేషాల్ని కూడా అందించబోతోంది.