హీరోయిన్లు కనిపించగానే వెంటపడడం చాలా కామన్. వచ్చే వ్యక్తి సెల్ఫీ కోసం వస్తున్నాడా లేక వేధిస్తాడా అనేది అర్థం కాని పరిస్థితి. మొన్నటికిమొన్న హీరోయిన్ శృతిహాసన్ ను ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ లో వెంబడించాడు. విమానం దిగినప్పట్నుంచి కారు ఎక్కేవరకు విడిచిపెట్టలేదు. ఇప్పుడు అలాంటి అనుభవమే హీరోయిన్ ప్రియాంక మోహన్ కు ఎదురైంది.
చెన్నైలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లింది ప్రియాంక మోహన్. అప్పుడే అగంతకుడు ఆమెకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించాడు. బౌన్సర్లు ఉండడంతో ప్రియాంక తప్పించుకుంది. అయితే అక్కడితో అయిపోలేదు సదరు వ్యక్తి ప్రియాంకను ఫాలో అయ్యాడు. షాపింగ్ మాల్ నుంచి ఇంటి వరకు వచ్చేశాడు
అంతేకాదు, ఆ మరుసటి రోజు ఓ ఫంక్షన్ లో కూడా ప్రియాంక మోహన్ వెంటపడ్డాడు. ఇదంతా ఓ కంట కనిబెడుతున్న ప్రియాంక, అతడ్ని దగ్గరకు పిలిచింది. తనను ఫాలో అవ్వొద్దని కాస్త గట్టిగానే హెచ్చరించింది. తనకు సెల్ఫీ కావాలని ఆ వ్యక్తి అడగడంతో, అతడితో సెల్ఫీ దిగిన ప్రియాంక, మరోసారి సున్నితంగా వార్నింగ్ ఇచ్చి పంపించేసింది.
చాలామంది హీరోయిన్లకు ఇలాంటివి అనుభవాలు కొత్త కాదు. సరిపోదా శనివారం సినిమాతో తెలుగులో పాపులర్ అయింది ప్రియాంక. ప్రస్తుతం ఆమె పవన్ కల్యాణ్ సరసన ఓజీ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.