
నాని కూడా పెద్ద స్టార్ అయ్యాడు. అందుకే అతడి సినిమాల క్లిప్స్ కూడా లీక్ అవుతున్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాల షూటింగ్ క్లిప్స్ మాత్రమే లీక్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు నాని కూడా ఈ లిస్ట్ లోకి చేరాడు.
విశాఖలో హిట్-3 సినిమా చేస్తున్నాడు నాని. ఆంధ్రా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. మేడపై నాని సిగరెట్ తాగుతుండగా హీరోయిన్ వచ్చి ఏదో మాట్లాడే సీన్ అది. ఆ సన్నివేశాన్ని దూరం నుంచి ఎవరో షూట్ చేసి లీక్ చేశారు.
ఈ సీన్ లీక్ అవ్వడం నానికి బాధ లేదు. ఎటొచ్చి ఆ సన్నివేశంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఉంది. దీంతో హిట్-3లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలిసిపోయింది.
శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది హిట్-3. తన బ్యానర్ పై నిర్మించే సినిమాల్లో తను హీరోగా నటించనని నాని గతంలో ప్రకటించాడు. అయితే హిట్-3 విషయంలో మాత్రం ఆ కట్టుబాటు పక్కనపెట్టాడు. కథ బాగా నచ్చడంతో, నిర్మిస్తూనే నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ గ్లింప్స్ ఆల్రెడీ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.