సెలబ్రిటీలు తమ ప్రేమ, పెళ్లి లాంటి అంశాల్ని మూవీ ప్రమోషన్స్ కోసం వాడుకునే ట్రెండ్ చాన్నాళ్లుగా ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి వనిత విజయ్ కుమార్ కూడా చేరినట్టు కనిపిస్తోంది. ఆమె తన పెళ్లిపై ప్రకటన చేసింది. అయితే డౌట్స్ చాలానే ఉన్నాయి.
ఇప్పటికే 3 సార్లు పెళ్లి చేసుకొని, 3 సార్లు విడాకులు తీసుకుంది వనిత విజయ్ కుమార్. 43 ఏళ్ల వనిత ప్రస్తుతం బ్యాచిలర్. ఇప్పుడీ ముద్దుగుమ్మ సడెన్ గా పోస్ట్ పెట్టింది. 5వ తేదీని లాక్ చేసుకోండి అంటూ కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో రొమాంటిక్ గా దిగిన ఫొటోను పోస్ట్ చేసింది.
వనిత-రాబర్ట్ కు చాన్నాళ్లుగా పరిచయం. ఇంకా చెప్పాలంటే మూడో భర్త పీటర్ ను పెళ్ళి చేసుకోకముందు నుంచే రాబర్ట్ తో పరిచయం ఉంది వనితకు. పీటర్ చనిపోయిన తర్వాత వీళ్లిద్దరూ దగ్గరయ్యారనే ప్రచారం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో రాబర్ట్ తో దిగిన ఫొటో పెట్టి, 5వ తేదీని లాక్ చేసుకోమని వనిత చెప్పడంతో చాలామంది అది ఆమె పెళ్లి కబురు అనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.
తన ఫ్రెండ్ రాబర్ట్ తో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ అనే సినిమా చేస్తోంది వనిత. ఈ సినిమా ప్రచారం కోసం ఆమె ఈ ఎత్తుగడ ఫాలో అయిందంటున్నారు చాలామంది. ప్రస్తుతానికి ఇదో పెద్ద సస్పెన్స్. 5వ తేదీన దీనిపై క్లారిటీ వస్తుంది. ఈ మేటర్ కనుక ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైతే వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి సిద్ధమైనట్టే.