దాదాపు ఏడాదిన్నర కాలంగా సమంత సినిమాల్లో నటించడం లేదు. ఆమె ఒక వెబ్ సిరీస్ ఒప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే సొంత నిర్మాణంలో తెలుగులో ఒక సినిమా తీస్తున్నట్లు ఆమె ప్రకటించింది. కానీ ఈ రెండూ ఇంకా మొదలు కాలేదు.
అలాగే, మలయాళంలో మమ్మూట్టి సరసన కూడా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సినిమా ఈ రోజు ప్రారంభం అయింది. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ఆ సినిమా దర్శక, నిర్మాత గౌతమ్ మీనన్ తో పాటు పలువురు సెలెబ్రిటీలు విచ్చేశారు. హీరోగా నటిస్తున్న మమ్మూట్టిపై ముహూర్తం సన్నివేశం చిత్రీకరించారు. కానీ సమంత హాజరు కాలేదు.
ఇంతకీ సమంత ఈ సినిమాలో నటిస్తోందా?
సమంత ఫలానా సినిమా ఒప్పుకుంది అని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఆమె షూటింగ్ లో పాల్గొనేంతవరకు ఆమె ఏ సినిమా చేస్తుందో కచ్చితంగా చెప్పలేం. అనారోగ్యం కారణంగానే సినిమాలకు దూరంగా ఉంది అని అంటున్నారు. కానీ ఆమె ఫోటోషూట్స్ చేస్తోంది. ట్రావెలింగ్ చేస్తోంది. బికినీ ఫోటోలు కూడా చూపిస్తోంది. సినిమాల విషయంలో మాత్రం అంత దూకుడు చూపడం లేదు.