రాజ్ తరుణ్ – లావణ్య కేసులో ఈ హీరోకి సమస్యలు ముదురుతున్నాయి.తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు నార్సింగ్ పోలీసులు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా అందులో ఏ1 గా రాజ్ తరుణ్, ఎ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3 గా మయాంక్ మల్హోత్రా పేర్లు చేర్చారు.
లావణ్య చెప్పిన కొన్ని కొత్త విషయాలు…
2010లోనాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు.
రాజ్ తరుణ్ కు 70 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేశాం.
కెరీర్ ప్రారంభంలో అతనికి ఉన్న అప్పులు అన్నీ మా కుటుంబమే తీర్చింది.
2014లో రాజ్ తరుణ్ నన్ను ఒక గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
2016లో అతని వల్ల గర్భం దాల్చాను
6 సంవత్సరాల్లో 6 సార్లు ఇల్లు మార్చాడు
మాల్వితోపాటు ఆమె సోదరుడు మయాంక్ నన్ను బెదిరించారు.
మరోవైపు, ఈ కేసు ఇలా నమోదు కాగానే “తిరగబడరా సామి” టీం విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 2న విడుదల కానుంది ఈ మూవీ.
“తిరగబడరా సామి” సినిమాలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే రాజ్ తరుణ్, మాల్వి మధ్య అఫైర్ మొదలైంది అని లావణ్య ఆరోపిస్తున్నారు.