నాగచైతన్య, శోభిత ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? సోషల్ మీడియాలో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఇది. దీనిపై ఇప్పటికే రకరకాల విశ్లేషణలు, పుకార్లు పుట్టుకొచ్చాయి.
సమంతతో వైవాహిక బంధంలో ఉన్నప్పుడే శోభితకు చైతూ కనెక్ట్ అయ్యాడని కొంతమంది పుకార్లు పుట్టిస్తుంటే… మరికొంతమంది మాత్రం సమంతకు విడాకులిచ్చిన తర్వాతే శోభితతో పరిచయమైందని అంటున్నారు.
ఈ మొత్తం చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది సమంత. నాగచైతన్య, శోభిత 2022 నుంచి టచ్ లో ఉన్నారని, 2024లో నిశ్చితార్థంతో వైవాహిక బంధానికి సంబంధించి తొలి అడుగు వేసిందని ప్రకటించింది.
సమంత ఇంతా క్లారిటీగా ఎలా చెప్పింది? అసలు ఈ మేటర్ పై సమంతకు స్పందించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మేటర్ ఏంటంటే.. ఈ విషయం చెప్పిన వ్యక్తి హీరోయిన్ సమంత కాదు. శోభిత చెల్లెలు సమంత.
ALSO READ: The Timeline of Chaitanya and Sobhita’s love story
అవును.. శోభిత చెల్లెలి పేరు కూడా సమంతానే. ఈమెకు ఆల్రెడీ పెళ్లయింది. వృత్తి రీత్యా డాక్టర్. చైతూ-శోభిత రిలేషన్ షిప్ ఏ ఏడాదిలో మొదలైందనే విషయాన్ని ఈమె బయటపెట్టింది. అయితే ఈమె చెప్పిన మేటర్ తో కూడా విభేదించేవారున్నారు. అది వేరే సంగతి.