ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిపోయింది భాగ్యశ్రీ బోర్సె. “మిస్టర్ బచ్చన్” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్న ఈ బ్యూటీ, ఆ సినిమా విడుదలకు ముందే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ లో తన డాన్స్ తో ఆకట్టుకున్న భాగ్యశ్రీ.. స్టేజ్ పై కూడా లైవ్ లో డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా డాన్స్ కు సంబంధించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
భాగ్యశ్రీ ఎక్కడా డాన్స్ నేర్చుకోలేదంట. ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా కాదంట. కాకపోతే భాగ్యశ్రీ తల్లి డాన్స్ మాస్టర్ అంట. అలా తనకు చిన్నప్పట్నుంచే చిన్నచిన్న స్టెప్పులేయడం అలవాటు అయిందని చెబుతోంది.
ఇక తండ్రికి సినిమా ఫీల్డ్ తో అనుబంధం ఉందంట. చిన్నప్పట్నుంచే రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ పాటలకు డాన్స్ చేసేందట. ఏదైనా అకేషన్ ఉంటే పాటలు పెట్టి తనే స్వయంగా డాన్స్ చేసేదంట. అలా డాన్స్ తన లైఫ్ లో భాగమైపోయిందని చెబుతోంది భాగ్యశ్రీ.