రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, లావణ్య… చాలా రోజుల పాటు వీళ్ల ముగ్గురి మధ్య వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నుంచి పాక్షికంగా మస్తాన్ సాయి సైడ్ అయినప్పటికీ.. రాజ్ తరుణ్, లావణ్య మధ్య ఇంకా ఇది నడుస్తూనే ఉంది.
ఇప్పుడీ కేసులో ట్విస్ట్ ఏంటంటే, మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. గుంటూరులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. గుంటూరులో అతడిపై డ్రగ్స్ కేసు ఉంది. జూన్ 3న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే, తప్పించుకున్నాడు. ఇప్పుడు దొరికాడు.
మస్తాన్ దొరకడంతో, ఇప్పుడు అందరి చూపు లావణ్యపై పడింది. ఎందుకంటే, హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో వీళ్లిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుపై చర్చించేందుకే తామిద్దరం రాజ్ తరుణ్ ఇంట్లో తరచుగా కలుసుకుంటున్నామని కూడా వీళ్లు గతంలో క్లెయిమ్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో.. పోలీసుల విచారణలో మస్తాన్ సాయి, లావణ్య గురించి మరిన్ని వివరాలు బయటపెడతాడేమో చూడాలి. అటు రాజ్ తరుణ్, మస్తాన్ సాయిపై ఇదివరకే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్-లావణ్య మధ్య ఎఫైర్ ఉందనేది రాజ్ తరుణ్ ఆరోపణ.