ఈ ఆగస్ట్ 15కి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఒకటి “మిస్టర్ బచ్చన్” కాగా, రెండోది “డబుల్ ఇస్మార్ట్.” ఈ రెండు సినిమాలు ఒకే ఫిలాసఫీ ఫాలో అవుతున్నాయి. అదే పకోడీ ఫిలాసఫీ. పకోడీ పేరిట “మిస్టర్ బచ్చన్ “లో ఏకంగా హీరో డైలాగ్ చెబితే.. మరో హీరో, తన “డబుల్ ఇస్మార్ట్” సినిమా ప్రమోషన్ లో భాగంగా పడోకీ పదప్రయోగం వాడాడు.
ముందుగా మిస్టర్ బచ్చన్ విషయానికొద్దాం.. ఈ సినిమా ట్రయిలర్ కు ఫినిషింగ్ టచ్ గా హీరో చెప్పిన డైలాగ్ చూద్దాం.. “చాలామంది భయపడేది సమస్యలకు కాదు. పుకార్లకు, రూమర్లకు. పనీపాట లేని చాలామంది పకోడీ గాళ్లు ఇదే పనిమీద ఉంటారు.”
ఇప్పుడు “డబుల్ ఇస్మార్ట్” ప్రచారంలో రామ్ ఏమన్నాడో చూద్దాం..
“హోటల్ కు వెళ్లి బిర్యానీ తింటాం. మనకు నచ్చుతుంది. చుట్టుపక్కల నలుగురు బాగాలేదంటే మన మీద మనకు డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది అనే అభిప్రాయంతో ఉండాలి. అది బిర్యానీ అయినా, సినిమా అయినా, కెరీర్ అయినా ఇలానే ఉండాలి. నీకు నచ్చింది నువ్వు చేయి, పక్కోడి ఒపీనియర్ వల్ల నీ ఒపీనియర్ మార్చుకోవద్దు. పక్కోడి గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ అన్నాయ్.”
ఇలా రామ్, రవితేజ ఇద్దరూ ఒకేసారి ‘పకోడీ ఫిలాసఫీ’ అందుకున్నారు. రవితేజ సినిమా కథకు తగ్గట్టు డైలాగ్ చెబితే, రామ్ మాత్రం రివ్యూలు బట్టి వ్యక్తిగత అభిప్రాయం మార్చుకోవద్దనే సందేశాన్నిచ్చాడు. ఈ రెండు సినిమాలూ ఆగస్ట్ 15కే వస్తున్నాయి.