గేమ్ ఛేంజర్ అనగానే ఎవరికైనా రామ్ చరణ్ గుర్తొస్తాడు. ఎందుకంటే, ఆయన కొత్త సినిమా టైటిల్ ఇది. కానీ అసలైన గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి చెప్పుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో చిరు ఆనందానికి అవధుల్లేవు. ఆయన తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ను గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు చిరంజీవి.
“నువ్వు గేమ్ ఛేంజర్ వి మాత్రమే కాదు, మేన్ ఆప్ ది మ్యాచ్ వి అని అందరూ అంటుంటే నా హృదయం ఉప్పొంగిపోతోంది,” అంటూ ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ విక్టరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు చిరంజీవి. తన కుటుంబంలో ఏ చిన్న మంచి జరిగినా దాన్ని దగ్గరుండి సెలబ్రేట్ చేసే చిరు.. పవన్ కోసం తన నివాసంలో పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. పవన్ గెలిచిన నేపథ్యంలో.. మెగా కుటుంబం మొత్తాన్ని మరోసారి కలిపే ప్రయత్నం చేస్తున్నారు.