హీరోయిన్లు రిలేషన్ షిప్ లో ఉండడం కామన్. ఎండాకాలం చెమట, వానాకాలం బురద ఎంత కామనో హీరోయిన్లు-ఎపైర్లు కూడా అంతే కామన్. ఈ క్రమంలో ఇదే ప్రశ్న హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఎదురైంది. ఆమె కూడా తను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వెల్లడించింది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్.
తను తన కెరీర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు స్పష్టం చేసింది కృతిశెట్టి. ప్రస్తుతం తను సినిమాలే లోకంగా బతుకుతున్నానని, కొన్నేళ్ల పాటు సీరియస్ గా కెరీర్ ను కొనసాగిస్తానని చెబుతోంది.
ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బెంగళూరులో సైకాలజీలో డిగ్రీ చేస్తున్న ఈ చిన్నది, మగాళ్లలో తనకు నచ్చే క్వాలిటీస్ కూడా బయటపెట్టింది. నిజాయితీగా ఉండే మగాళ్లంటే కృతి శెట్టికి ఇష్టమంట. దీంతో పాటు పొడుగ్గా చూడ్డానికి బాగుండే అబ్బాయిలంటే ఇష్టం అంటోంది.
లాంగ్ గ్యాప్ తర్వాత మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది కృతి. ఇకపై తెలుగులో గ్యాప్ ఇవ్వనని, బ్యాక్ టుబ్యాక్ సినిమాలు చేస్తానని చెబుతోంది.