శంకర్ తీస్తున్న “గేమ్ ఛేంజర్” షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రతివారం ఇదే చివరి వారం అంటున్నారు. కానీ ఇంకా షూటింగ్ కొలిక్కి రావడం లేదు. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు సంబంధించి పనులు మొదలు పెట్టాడు రామ్ చరణ్.
తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన లుక్ కోసం పని మొదలు పెడుతున్నాడు.
రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు చరణ్. దీని కోసం ఆస్ట్రేలియా వెళ్లి నెల రోజులకు పైగా ట్రయినింగ్ తీసుకుంటాడట. ఆ వెంటనే సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ గ్యాప్ లో జాన్వి కపూర్ కూడా దేవర సినిమా ముగించి, ఫ్రీ అవుతుంది.
ఐతే, ఆగస్టులో వెళ్తాడా లేక సెప్టెంబర్ లోనే అన్నది ఇంకా తేలలేదు. శంకర్ “గేమ్ ఛేంజర్”కి గుమ్మడి కాయ కొట్టిన తర్వాత విదేశాలకు వెళ్లి వస్తాడు.
ALSO READ: Both NTR and Ram Charan to undergo complete makeover
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 3 పాటల రికార్డింగ్ పూర్తయింది.