దేశం గర్వించదగ్గ గాయనీ గాయకులు చాలామంది ఉన్నారు. సౌత్ లో బాలసుబ్రమణ్యం నుంచి మొదలుపెడితే నార్త్ లో మహ్మద్ రఫీ వరకు పదుల సంఖ్యలో లెజెండ్స్ లాంటి సింగర్స్ ఉన్నారు. అయితే వీళ్లెవ్వరూ రాశిఖన్నాకు ఇష్టం లేదు.
ఆమె మెచ్చిన మొదటి సింగర్, తండ్రి. అవును.. తన తండ్రి పాడితే చాలా ఇష్టమని అంటోంది రాశీఖన్నా. నాన్న మనసుతో పాడతాడని, ఆ ఫీలింగ్ నాకు చాలా ఇష్టమని చెబుతోంది.
నాన్న తర్వాత శ్రేయాఘోషల్ గాత్రం అంటే చాలా ఇష్టం అంటోంది ఈ బ్యూటీ.
ఈ చిన్నది పరిశ్రమకొచ్చి పదేళ్లయింది. ఆమె నటించిన “ఊహలు గుసగుసలాడే” సినిమా రిలీజై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఇనస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన రాశిఖన్నా, కొన్ని ఆసక్తికర అంశాల్ని బయటపెట్టింది.
తనకు షారూక్, రణబీర్ అంటే ఇష్టమని ప్రకటిస్తూ, తనకు ఓ చిన్న పాత్ర అయినా ఇవ్వాల్సిందిగా వాళ్లిద్దర్నీ లైవ్ లో రిక్వెస్ట్ చేసింది. వెకేషన్ కంటే రోజూ షూటింగ్స్ చేయడం ఈ ముద్దుగుమ్మకు ఇష్టమంట.