తన ఫౌండేషన్ ద్వారా ఎప్పుడూ పేదలకు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉంటాడు మహేష్ బాబు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించి తన పెద్ద మనసు చాటుకున్న ఈ సూపర్ స్టార్.. ఇప్పుడు మరోసారి అదే పని చేశాడు.
తన వీరాభిమానిని ఆదుకున్నాడు మహేష్. కృష్ణా జిల్లా మోపీదేవికి చెందిన రాజేష్ అనే వ్యక్తి మహేష్ అభిమాని. అతడికి మహేష్ అంటే ఎంత అభిమానమంటే.. అర్జున్ సినిమా రిలీజైన టైమ్ లో కొడుకు పుడితే, అతడికి అర్జున్ అని పేరుపెట్టాడు. అతిథి రిలీజ్ టైమ్ లో పుట్టిన కొడుక్కి అదే పేరు పెట్టాడు. ఇక ఆగడు రిలీజైన టైమ్ కు మూడో కొడుకు పుడితే వాడికి ఆగడు అని పేరు పెట్టుకున్నాడు. మహేష్ అంటే అంత పిచ్చి.
అయితే ఈ వీరాభిమాని జబ్బుపడ్డాడు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో మంచాన పడ్డాడు. దీంతో పెద్దకొడుకు అర్జున్, చెప్పులు షాపులో పనికి కుదిరాడు. మిగతా ఇద్దరు కొడుకులు చదువు మానేశారు. ఈ విషయం మహేష్ కు తెలిసిందే. వెంటనే మహేష్ టీమ్ ఆ కుటుంబాన్ని సంప్రదించింది. పిల్లల్ని దగ్గర్లోని స్కూల్ లో జాయిన్ చేసింది. వాళ్లకు ప్రతి ఏటా మహేష్ బాబు ఫీజులు కడతాడని, ఏటా తమకు గుర్తుచేస్తే చాలని తెలిపింది. అంతేకాదు, ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం కూడా చేసింది. దటీజ్ మహేష్.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు.