“కల్కి 2898 AD” సెకెండ్ ట్రయిలర్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఓవైపు లీకులపై చర్యలు తీసుకుంటామంటూ అశ్వనీదత్ బహిరంగంగా లీగల్ నోటీసు జారీ చేసినప్పటికీ లీకులు ఆగడం లేదు. ఈసారి ఏకంగా ట్రయిలరే లీక్ అయిపోయింది.
ముంబయిలో కల్కి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకలో కల్కి సెకెండ్ ట్రయిలర్ ను ప్రదర్శించారు. దీన్నే కల్కి రిలీజ్ ట్రయిలర్ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రయిలర్ ను ప్రసారం చేయడానికి ముందే ఎవ్వరూ షూట్ చేయొద్దని, లీక్ చేయొద్దని మేకర్స్ రిక్వెస్ట్ చేశారు.
కానీ ఇలాంటివి ఆగవు కదా.. ఓవైపు తెరపై కల్కి సెకెండ్ ట్రయిలర్ ప్రసారం అవుతుంటే, మరోవైపు అది రికార్డ్ అయింది. ఆ వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సెకెండ్ ట్రయిలర్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది.
ఈ రెండో ట్రయిలర్ ను శుక్రవారం (జూన్ 21) అధికారికంగా లాంచ్ చేస్తారు. ఈ సినిమా 27న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. సెన్సార్ పూర్తయింది. మరోవైపు ఏపీ, తెలంగాణాలో రేట్ల పెంపు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు అశ్వనీదత్..