రామ్ చరణ్.. మొన్నటివరకు మెగాపవర్ స్టార్. కానీ అతడి బిరుదు మారిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అతడికి గ్లోబల్ స్టార్ అనే బిరుదు కట్టబెట్టారు. ఇకపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
ఎన్టీఆర్ ది కూడా ఇదే పరిస్థితి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ముందువరకు ఆయన యంగ్ టైగర్. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత ఆయన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గా మారాడు. ‘దేవర’ సినిమాకు అదే టైటిల్ పడబోతోంది.
అల్లు అర్జున్ కూడా బిరుదు మార్చుకున్నాడు. స్టయిలిష్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉండేది. కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు.
ఇక రీసెంట్ గా మరో ఇద్దరు హీరోలు కూడా తమ బిరుదులు మార్చుకున్నారు. వీళ్లలో ఒకడు శర్వానంద్. ఈ హీరోకు ఓ కొత్త బిరుదు ఆపాదించారు. అదే ఛార్మింగ్ స్టార్. రీసెంట్ గా ‘మనమే’ అనే సినిమా చేశాడు శర్వ. ఈ సినిమా నుంచే అతడికీ బిరుదు వచ్చింది.
ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ వంతు. మొన్నటివరకు ఇతడు సుప్రీమ్ హీరో. కానీ ఇకపై మెగా సుప్రీమ్ హీరో. ఆ మేరకు కొత్త బిరుదుతో సాయితేజ్ ను పిలవడం మొదలైంది. తన పేరు మార్చుకున్నట్టుగానే, బిరుదును కూడా మార్చుకున్నాడు ఈ మెగా హీరో.
వీళ్లు మాత్రమే కాదు.. త్వరలోనే మహేష్ బాబు, గోపీచంద్, విజయ్ దేవరకొండ బిరుదులు కూడా మారబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ.