
కేవలం సుఖాలు, సంతోషాలు, అందాలు మాత్రమే కాదు.. సందర్భం వస్తే కష్టాలు కూడా షేర్ చేస్తుంటారు హీరోయిన్లు. ఇప్పుడు రష్మిక అదే మోడ్ లో ఉంది. కాలికి దెబ్బ తగిలి ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ, ఇనస్టాగ్రామ్ లో ఏకంగా తన మెడికల్ రిపోర్ట్ పెట్టేసింది.
రష్మిక కాలికి ఏకంగా 4 ఫ్రాక్చర్స్ అయ్యాయి. దానికి సంబంధించిన ఎక్స్ రేను, రిపోర్ట్ సైతం ఆమె సోషల్ మీడియాలో పెట్టేసింది. మరో 2 వారాల పాటు కాలు కదపకూడదని వైద్యులు సూచించినట్టు వెల్లడించింది.
ఇంత దెబ్బ తగిలినా ఆమె తగ్గలేదు. తన హిందీ సినిమా ‘ఛావా’ ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లింది. ఎయిర్ పోర్ట్ లో కుంటుతూ వీల్ ఛెయిర్ ఎక్కిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ముంబయిలో కూడా అలానే కుంటుకుంటూ స్టేజ్ పైకి వచ్చి మీడియాతో మాట్లాడింది.
రష్మిక మెడికల్ రిపోర్ట్ తో ఆమె తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి రాగలదనే క్లారిటీ మేకర్స్ కు వచ్చేసింది. జిమ్ లో వ్యాయామం చేస్తూ గాయపడింది రష్మిక.