
ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య గ్యాప్ గురించి కొత్తగా చెప్పుకోడానికేం లేదు. ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టినట్టు ఇప్పటికే వేలాది కథనాలొచ్చాయి. ఆ కథనాలకు మరింత బలం చేకూరుస్తూ, ఎడమొహం-పెడమొహంగా ఉంటారు ఈ బాబాయ్-అబ్బాయ్.
రీసెంట్ గా జరిగిన ఓ చిట్ చాట్ లో కూడా ఎన్టీఆర్ ప్రస్తావన లేకపోవడంపై తారక్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. బాలకృష్ణ ప్రస్తావించిన తర్వాత దాన్ని పనిగట్టుకొని కట్ చేశారని తెలిసి మరింత భగ్గుమన్నారు.
ఇలా బాలయ్య-ఎన్టీఆర్ మధ్య ప్రతిసారి గ్యాప్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇలాంటి టైమ్ లో మండు వేసవిలో చల్లటి వర్షంలా ఓ ట్వీట్ పడింది. ‘బాలా బాబాయ్’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ వేయడం అందర్నీ ఆకర్షించింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. బాలయ్యకు పద్మభూషణ్ వచ్చింది. పరిశ్రమ మొత్తం అభినందనలతో హోరెత్తిపోతోంది. అందరూ శుభాకాంక్షలు చెప్పడం ఒకెత్తు, ఎన్టీఆర్ స్పందించడం మరో ఎత్తు. “పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా బాలా బాబాయ్ కు శుభాకాంక్షలు” అంటూ ఎన్టీఆర్ స్పందించిన తీరు అందరికీ నచ్చింది.