
ఈ ఏడాది తొలి వంద కోట్ల హీరోయిన్ ను తానేనంటూ గొప్పలు చెప్పుకుంది ఊర్వశి రౌతేలా. ‘డాకు మహారాజ్’ సినిమాతో తను స్టార్ అయిపోయానని బిల్డప్పులు ఇచ్చుకుంది. ఓవైపు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురయ్యాడని జర్నలిస్ట్ అడుగుతుంటే, మరోవైపు చేతికున్న డైమండ్ రింగ్, వాచీ చూపించుకొని గప్పాలు కొట్టుకున్న ఊర్వశికి ఎదురుదెబ్బ తగిలింది.
బాలీవుడ్ లో రిలీజైన ‘డాకు మహారాజ్’ సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుందని అంటోంది హిందీ మీడియా. పక్కా తెలుగు ప్రేక్షకుల కోసమే తీసిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడమే తప్పని, అలాంటి సినిమాను పట్టుకొని ఊర్వశి ఓవరాక్షన్ చేయడం ఇంకా తప్పంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నార్త్ బెల్ట్ లో ‘డాకు మహారాజ్’ సినిమాకు సంబంధించి 99 శాతం షోలు కాన్సిల్ అయ్యాయంట. తొలి రోజు కేవలం 10 లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చిందంట. కాబట్టి ఇకనైనా ఊర్వశి, డప్పు కొట్టడం ఆపేస్తే మంచిదని అంటున్నారు.
మరోవైపు ఊర్వశి మాత్రం తన పంథాలో తాను దూసుకుపోతోంది. ఇనస్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం, తన వాల్ పై ‘దబిడి దిబిడి’ సాంగ్ క్లిప్స్ ను అదే పనిగా పోస్టు చేస్తోంది. 10 రూపాయలకు రూ.100 యాక్షన్ చేయడం అంటే ఇదేనేమో.