ఐదేళ్ల పాటు షూటింగ్ చేసిన ‘పుష్ప-2’ సినిమా పూర్తయింది. ఈ విషయాన్ని బన్నీ స్వయంగా ప్రకటించాడు కూడా. అయితే దీనికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని అతడు వెల్లడించాడు.
బన్నీ కంటే ఒక రోజు ముందు ‘పుష్ప-2’ షూటింగ్ పూర్తిచేసిందంట రష్మిక. చివరి రోజు షూట్ లో భావోద్వేగం ఆపుకోలేక ఏడ్చేసిందంట. ఏడేళ్ల కెరీర్ లో ఐదేళ్ల పాటు పుష్ప ఫ్రాంచైజీపైనే వర్క్ చేసిన ఈ హీరోయిన్, ఆ మాత్రం ఎమోషనల్ అవ్వడంతో తప్పులేదు.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన అల్లు అర్జున్, ఆరోజున రష్మికను తను ఓదార్చానని, కానీ ఆ మరుసటి రోజు ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాలేదన్నాడు. రష్మిక షూట్ పూర్తయిన మరుసటి రోజే బన్నీ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఆరోజు తను కూడా చాలా ఎమోషనల్ అయిపోయానని, ఎలా స్పందించాలో తెలియక చాలా సేపు సైలెంట్ గా ఉండిపోయానని అన్నాడు.
ముంబయిలో ‘పుష్ప-2’ ఈవెంట్ చేశారు. ఆ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించాడు అల్లు అర్జున్. ‘పుష్ప-1’ సినిమా సక్సెస్ తనకు చాలని.. ‘పుష్ప-2’ మాత్రం సినిమా యూనిట్ లో అందరూ పడిన కష్టం కోసమైనా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాడు.