అందాల ఫొటోషూట్స్ తో కనువిందుచేసే ప్రగ్యా జైశ్వాల్ ఇప్పుడు హాట్ హాట్ కామెంట్స్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఓ క్రికెటర్ పై ఈమె మనసు పారేసుకుంది. అతడు ఓకే అంటే డేటింగ్ కు రెడీ అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
33 ఏళ్ల ప్రగ్యా జైశ్వాల్, తను చాన్నాళ్లుగా సింగిల్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది. భారతీయ క్రికెటర్ శుభమన్ గిల్ చాలా బాగుంటాడని, అతడు ఓకే అంటే మింగిల్ అవ్వడానికి రెడీ అంటూ ప్రకటించింది.
ప్రగ్యా జైశ్వాల్ పై పెద్దగా డేటింగ్ రూమర్స్ లేవు. ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఇప్పటివరకు కథనాలు రాలేదు. బహుశా, అందుకేనేమో ఈసారి ఆ కోణాన్ని కూడా టచ్ చేసింది ప్రగ్యా. అందాలతో కవ్వించడంతో పాటు, స్టేట్ మెంట్స్ తో కూడా ఆకర్షిస్తోంది.
తెలుగులో ఆమె అడపాదడపా సినిమాలు చేస్తోంది. ‘అఖండ-2’లో కూడా ఆమెను రిపీట్ చేశాడు బాలయ్య. రీసెంట్ గా ఓ హిందీ సినిమా కూడా చేసింది ప్రగ్యా.