
అలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే టైమ్ లో హీరోయిన్ రష్మికపై ట్రోలింగ్ మొదలైంది. ఈ రెండు అంశాలకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. కచ్చితంగా ఉంది.
‘జిగ్రా’ సినిమా చూసింది రష్మిక. సినిమా బాగుందంటూ పోస్టు పెట్టింది. ఇలా సెలబ్రిటీలు ట్వీట్స్ వేసి సినిమాను లేపాలనే ప్రయత్నం చేయడం సహజం. ఇందులో తప్పుపట్టడానికేం లేదు. కానీ రష్మిక మాత్రం ఈ విషయంలో కాస్త అతి చేసింది.
‘జిగ్రా’ సినిమాను మెచ్చుకునే క్రమంలో అలియాభట్ ప్రేక్షకులకు ఓ వరం అంటూ స్పందించింది. ఈ జనరేషన్ ది బెస్ట్ అలియా అంటూనే, ఆమె నటనను కళ్లారా చూస్తున్నందుకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇది చాలామందికి చిరాకు తెప్పించింది.
అసలే ‘జిగ్రా’ సినిమాపై మిక్స్ డ్ టాక్ నడుస్తుంది. బాలీవుడ్ సోషల్ మీడియా మాఫియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి అసలు రంగు రేపటికి బయటపడుతుంది. అంతలోనే రష్మిక, ఓవర్ గా స్పందించడంతో, ఆమెపై కొంతమంది ట్రోలింగ్ కు దిగారు.