![Koratala Siva](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/09/koratalasiva-devarainterview.jpg)
‘డీజే టిల్లూ’ హిట్టయింది కాబట్టి పార్ట్-2 వచ్చింది, పార్ట్-3 కూడా ప్రకటించేశారు. ‘కేజీఎఫ్’ పార్ట్-1, పార్ట్-2 వచ్చేశాయి. పార్ట్-3 కూడా తీస్తానంటున్నాడు దర్శకుడు. ఇలా సినిమా హిట్టయితే మరో పార్ట్ ప్రకటించడం ఆనవాయితీ అయిపోయింది. అయితే ‘దేవర’కు ఆ ఛాన్స్ లేదని తేల్చేశాడు కొరటాల.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కింది ‘దేవర’. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్నది పార్ట్-1. త్వరలోనే పార్ట్-2 సెట్స్ పైకి వస్తుంది. మరి పార్ట్-3 సంగతేంటి?
‘దేవర’ సినిమాకు పార్ట్-3 లేదని స్పష్టం చేశాడు దర్శకుడు కొరటాల శివ. తను రాసుకున్న కథ పార్ట్-2తోనే ముగిసిపోతుందని, ‘దేవర’ను ఓ ఫ్రాంచైజీగా మార్చే ఆలోచన, ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని చెప్పేశాడు.
ఇక ‘దేవర-2’లో కుర్ర ఎన్టీఆర్ విశ్వరూపం చూస్తారని, అలాగే జాన్వి కపూర్ స్క్రీన్ టైమ్, ఆమె పాత్ర పూర్తి స్వరూపాన్ని కూడా పార్ట్-2లో చూస్తారని చెబుతున్నాడు. పార్ట్-1లో వేసిన ముడులన్నీ పార్ట్-2లో విప్పి, అక్కడితో ‘దేవర’ కథను ముగిస్తానని చెప్పాడు కొరటాల.