ఈ ఏడాది సంక్రాంతికొచ్చిన గుంటూరుకారం సినిమా రిజల్ట్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా పెద్ద హిట్టని, తమకు డబ్బులు తెచ్చిపెట్టిందని కేవలం నిర్మాత నాగవంశీ మాత్రమే చెబుతారు. మిగతావాళ్లంతా సైలెంట్ అయ్యారు. చివరికి మహేష్ అభిమానులు కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి.
మరి అలాంటి సినిమాతో దేవర సినిమాను పోలిస్తే ఎలా ఉంటుంది. దేవర సినిమాకు ప్రారంభంలో మిక్స్ డ్ టాక్ వచ్చిన మాట నిజమే. కాకపోతే ఆ సినిమా ఊపందుకుంది. మంచి వసూళ్లు సాధిస్తోంది. గుంటూరుకారం విషయంలో అలా జరగలేదు.
కానీ గుంటూరు కారం, దేవర సినిమాలు ఒకటే అంటున్నాడు నాగవంశీ. గుంటూరు కారం హిట్టయింది కాబట్టి, దేవర సినిమా కూడా హిట్ అంటున్నాడు.
“దేవర సినిమా హిట్టయింది. కాబట్టి మిడ్ నైట్ షో ఎత్తుగడ మాకు ప్లస్ అయినట్టే లెక్క. దేవరతో నేను ఓ కొత్త విషయం తెలుసుకున్నాను. మిడ్-నైట్ షోలో టాక్ ఎలా ఉన్నప్పటికీ సినిమా బాగుంటే జనం చూస్తారు. గుంటూరు కారం విషయంలో కూడా ఇలానే జరిగింది.”
ఇలా దేవరతో కంపేర్ చేస్తూ, గంటూరు కారం కూడా హిట్టయిందంటున్నాడు నిర్మాత.