రష్మిక మందాన ఒక్కసారిగా రాజకీయ చర్చలోకి వచ్చింది. ఆమెకి రాజకీయాలకు సంబంధం లేదు కానీ, ఆమె ప్రధాని మోదీకి అనుకూలంగా షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తో ఆమె పొలిటికల్ డిస్కషన్ లోకి చేరింది.
ఆమె ఇదంతా కొన్ని ఇబ్బందులను తప్పించుకునేందుకు చేసింది అనే కామెంట్ వినిపిస్తోంది. ఆ మధ్య ఆమెకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఆమె 4 కోట్ల రూపాయలు మేరకు ఐటీ శాఖకు కట్టాలని ఆ నోటీసుల సారాంశం. ఆమె సమర్పించిన ఆదాయపు పన్ను పత్రాల్లో తేడాలున్నాయి అని ఐటీ శాఖ పేర్కొందట. ఆమె ఆదాయానికి, పన్నుకు చెల్లించిన మొత్తానికి ఉన్న తేడాల కారణంగా ఆమె నాలుగు కోట్ల రూపాయల వరకు చెల్లించాలి అని ఐటి శాఖ ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి ఆమె తప్పించుకున్నట్లే అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ALSO READ: Rashmika Mandanna’s Atal Setu video gets trolls and praise
రష్మిక మందాన సాధారణ సమయంలో ఇలాంటి వీడియో పోస్టులు పెడితే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇది ఎన్నికల సమయం కావడంతో ఈ లొల్లి. ఆమె ఐటి చిక్కులు తప్పించుకునేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం గొప్ప పనులు చేసింది అన్నట్లుగా అటల్ సేతు బ్రిడ్జ్ గురించి వీడియో పెట్టింది అనే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.