పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సినిమా తారలు అందరూ పిఠాపురం వెళ్తున్నారు. కొందరు ప్రచారం చేస్తున్నారు. కొందరు కేవలం మద్దతు ప్రకటిస్తున్నారు. నాని లాంటి హీరోలు సోషల్ మీడియాలో పవన్ కి మద్దతుగా పోస్టులు పెట్టింది గమనించాం.
ఇక పవన్ కళ్యాణ్ సొంత కుటుంబం నుంచి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి వీడియో ద్వారా పవన్ ని గెలిపించాలని కోరారు. మరో సోదరుడు నాగబాబు జనసేన పార్టీలోనే కీలకంగా ఉన్నారు. మరి రామ్ చరణ్ పరిస్థితి ఏంటి?
ఇంతకుముందు అంటే గత ఎన్నికల సమయంలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చెయ్యలేదు కానీ మంగళగిరిలో జనసేన ఆఫీస్ కి వెళ్లి బాబాయి ని కలిశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… తన మద్దతు తెలిపారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా?
ALSO READ: జనసేనానికి ఇండస్ట్రీ మద్దతు
ప్రచారం ముగింపుకి ఇంకా రెండు రోజుల టైం ఉంది. కానీ రామ్ చరణ్ పవన్ ని కలవాలనుకుంటే ప్రచారం ముగింపు తేదీతో పనిలేదు. ఎన్నికల తేదీలోపు ఎప్పుడు కలిసినా రావాల్సిన మైలేజ్ వస్తుంది. మరి నిజంగా వెళ్లి కలుస్తారా లేదా అన్నది చూడాలి.
ఈ ఎన్నికలను పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అభిమానులు, అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని వారంతా ధీమాగా ఉన్నారు.