హీరో రణవీర్ సింగ్ తన పెళ్లి ఫోటోలను తొలగించాడు అంటూ నిన్న అంతా సోషల్ మీడియాలో ఒక రచ్చ జరిగింది. రణవీర్ సింగ్, ఆయన భార్య దీపిక విడిపోతున్నారనే విషయం ఇక కన్ఫర్మ్ అయింది అంటూ వార్తలు అల్లేశారు.
ఒక రోజు తర్వాత అసలు విషయం బయట పడింది. 2023 తర్వాత పాత ఫోటోలను అన్నింటిని రణవీర్ తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తీసేశాడు. సో, పెళ్లి ఫోటోలు సహా అన్ని పోయాయి. అంతే కానీ పెళ్లి ఫోటోలు మాత్రమే తొలగించలేదు.
రణవీర్ సింగ్ సోషల్ మీడియా అకౌంట్స్ ని ఒక పెద్ద ఏజెన్సీ హ్యాండిల్ చేస్తుంది. ఆ సంస్థ సలహా ప్రకారం పాత ఫోటోలను తొలగించాడట. అంతకుముందు దీపిక పదుకోన్ కూడా 2020కు ముందు పోస్ట్ చేసిన అన్ని ఫోటోలను డిలీట్ చేసింది. ఇది అంతా సోషల్ మీడియా సంస్థ సలహా. అంతే తప్ప, వారి కాపురంలో ఎలాంటి సమస్య లేదు అని క్లారిటీ వచ్చింది.
దీపిక పదుకొను ప్రస్తుతం గర్భవతి. దీపిక, రణవీర్ ఈ ఏడాది సెప్టెంబర్ లో తల్లితండ్రులు కాబోతున్నారు. పెళ్లి అయిన ఆరేళ్లకు వీరికి సంతానం కలగబోతుంది. ప్రస్తుతం వారు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ, రణవీర్ పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడంటూ నిన్న అంతా రకరకాల పుకార్లు పుట్టించారు.