
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. తాజాగా నాన్నమ్మ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా లుక్ లో కనిపించాడు చెర్రీ.
చిరంజీవి తల్లి అంజనాదేవీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ ఇంట జరిగిన ఈ సెలబ్రేషన్ వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోను స్వయంగా రామ్ చరణ్ షూట్ చేశాడు. అలా షూట్ చేసిన వీడియోలో రామ్ చరణ్ సందడి మామూలుగా లేదు.
చిరంజీవి కుటుంబ సభ్యులు ఈసారి అంజనాదేవీ పుట్టినరోజు వేడుకలను భిన్నంగా జరిపారు. గులాబీ పూలతో ఆమెకి వందనాలు సమర్పించారు. చిరంజీవి కూడా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
మరోవైపు, రామ్ చరణ్ తన కొత్త సినిమాతో బిజీ కానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. నైట్ ఎఫెక్ట్ లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. రేపోమాపో చరణ్ కూడా జాయిన్ అవుతాడు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారు.