
మహా కుంభమేలాలో ఒక అమ్మాయి అందం అందరినీ ఆకర్శించింది. మోనాలిసా అనే ఒక సాధారణ యువతి ఆమె సహజ సౌందర్యంతో సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. దాంతో, ఆమెని ఉదహరిస్తూ కంగనా రనౌత్ పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం బాలీవుడ్ లోనూ, ఇతర సినిమా ఇండస్ట్రీలోనూ “తెల్ల పిల్ల”కు ఉన్న క్రేజ్ సహజ భారతీయ రంగుతో కూడిన హీరోయిన్లకు లేదు అని ఆమె మండిపడింది. ఒకప్పుడు కాజోల్, బిపాసా బసు, దీపిక పదుకోన్ తమ ఛామన ఛాయ సౌందర్యంతో కుర్రకారును ఆకర్శించారు. కానీ ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ భామలకే క్రేజ్ ఉంది.
“తన సహజ సౌందర్యంతో మోనాలిసా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. ఫోటోలు, ఇంటర్వ్యూల కోసం ఆమెను వేధించడం నాకు నచ్చలేదు కానీ ఆమె పాపులారిటీ నాలో కొత్త ప్రశ్నని తీసుకొచ్చింది? ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో భారతీయ రంగుకి ప్రాతినిధ్యం వహించే హీరోయిన్లు ఉన్నారా అనే ప్రశ్న అడగలేకుండా ఉన్నాను. అను అగర్వాల్, కాజోల్, బిపాషా, దీపిక, రాణి ముఖర్జీని ఇష్టపడినంతగా నేటితరం ప్రజలు ఇష్టపడుతున్నారా?,” అని కంగనా పోస్ట్ చేసింది.
ఇప్పుడు భారతీయ సినిమాల్లో మన “రంగు” ఉన్న హీరోయిన్లు కావాలి, రావాలి అని ఆమె పేర్కొంది.