
రాఖీ సావంత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆలిండియాను ఓ ఊపు ఊపిన అందాలవి. సినిమాల్లో ఆమె ఎంత బోల్డ్ గా ఉంటుందో, బయట కూడా అంతే బోల్డ్ అనే సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న రాఖీ, ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైంది.
మూడోసారి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతోంది రాఖీ సావంత్. ఆమెకు కాబోయే మూడో భర్త పేరు డోడి ఖాన్. ఇతడికి పాకిస్థాన్. పలు సినిమాలకు నిర్మాత. ఇతడే రాఖీ సావంత్ కాబోయే భర్త.
తను మరోసారి పెళ్లి చేసుకోబోతున్న స్వయంగా రాఖీ సావంత్ ప్రకటించింది. ఇన్నాళ్లకు తనకు సరైన వ్యక్తి దొరికాడని, ఇస్లాం సంప్రదాయంలో తామిద్దరం నిఖా చేసుకుంటామని వెల్లడించింది.
గతంలో రితేష్ సింగ్ ను పెళ్లాడింది రాఖీ. అతడికి విడాకులిచ్చిన తర్వాత ఆదిల్ ఖాన్ కు కనెక్ట్ అయింది. పెళ్లయిన మొదటి వారం నుంచే వీళ్లిద్దరికీ పడలేదు. అలా అతడ్ని కూడా దూరం పెట్టిన రాఖీ సావంత్, ఇప్పుడు డోడి ఖాన్ కు దగ్గరైంది.