కెరీర్ ప్రారంభంలోనే ‘మగధీర’ సినిమాతో రామ్ చరణ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు రాజమౌళి. అప్పటికి అది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందులో వీరుడిగా చరణ్ ను చూపించాడు. తొలిసారి చరణ్ గుర్రపు స్వారీ చేసింది కూడా ఆ సినిమాలోనే.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆయన గుర్రంపై కనిపించాడు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ లో కూడా గుర్రమెక్కాడు. అయితే ఈసారి మాత్రం రాజమౌళి అభ్యంతరం తెలిపాడు. ఇంకో సినిమాలో గుర్రం సీన్ పెడితే ఊరుకోనంటూ సరదాగా కామెంట్ చేశాడు.
‘గేమ్ ఛేంజర్’ ట్రయిలర్ లో చరణ్ గుర్రంపై బీచ్ లో స్వారీ చేసే షాట్ ఉంది. దానిపై స్పందించాడు రాజమౌళి. ఆ షాట్ ఎంతో బాగుందంటూనే.. ‘మగధీర’ తర్వాత చరణ్ గుర్రం సీన్లపై తను పేటెంట్ తీసుకున్నానని, ఇకపై ఏ సినిమాలో చరణ్ గుర్రంపై కనిపించకూడదంటూ సరదాగా అన్నాడు.
ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. దర్శకుల్లో శంకర్ ను ఓజీతో పోల్చాడు.