హీరో రాజ్ తరుణ్, కొంతమంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించాడంటూ గతంలో చాలా పుకార్లు వచ్చాయి. కానీ వాటికి ఆధారాల్లేవు. ఎవరూ బయటకొచ్చి మాట్లాడలేదు కూడా. కానీ తొలిసారి లావణ్య, రాజ్ తరుణ్ ఎఫైర్లపై స్పందించింది. అతడితో ఎపైర్ సాగించిన హీరోయిన్ల పేర్లు బయటపెట్టింది.
హీరోయిన్ షాలినీతో రాజ్ తరుణ్ ఎపైర్ సాగించాడట. ఇద్దరిలోకం ఒకటే సినిమా టైమ్ లో వీళ్లిద్దరూ కలిశారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో కూడా రాజ్ తరుణ్ ప్రేమాయణం సాగించాడట. ఆమెతో కేవలం ఒక రోజు మాత్రమే షూటింగ్ చేశాడని, కానీ ఒక్క రోజులోనే ఆమెను పడేసి, చాలా దూరం తీసుకెళ్లాడని అంటోంది.
ఇక రాజ్ తరుణ్ లిస్ట్ లో రిద్దీ కుమార్ కూడా ఉందంటోంది లావణ్య. వీళ్లిద్దరూ కలిసి లవర్ అనే సినిమా చేశారు. ఆ టైమ్ లోనే ఆమెతో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడని, చాన్నాళ్ల పాటు రిద్దీని మెయింటైన్ చేశాడని ఆరోపిస్తోంది.
ఇప్పుడు మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ షిప్ స్టార్ట్ చేశాడని అంటోంది లావణ్య. గతంలో ఎన్ని రిలేషన్ షిప్స్ పెట్టుకున్నప్పటికీ, రాజ్ తరుణ్ తనతో ఉన్నాడని, ఈసారి మాత్రం మాల్వీ మోజులో పడి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అంటోంది. అందుకే తను మీడియా ముందుకొచ్చానంటోంది.