మంచు మనోజ్, మౌనిక దంపతులకు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పాపకు పేరు పెట్టారు. కూతురుకు దేవసేన శోభ ఎంఎం అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా ప్రకటించాడు.
“మా పాపకు దేవసేన శోభ ఎంఎం అనే పేరు పెట్టాం. చిన్నారికి ఎంఎం పులి అనే ముద్దుపేరు ఉందనే విషయం చాలామందికి తెలుసు. స్వయంగా శివభక్తుడ్ని కావడంతో, సుబ్రమణ్య స్వామి భార్య పేరు అయిన దేవసేనను నా పాపకు పెట్టుకున్నాను. ఇక పాప మిడిల్ నేమ్ శోభ. మా అత్తగారిని గుర్తుచేసుకుంటూ ఆ పేరు పెట్టాను.”
ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు, ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు మంచు మనోజ్. మోహన్ బాబు, మంచు లక్ష్మి పేర్లు ప్రస్తావించిన మనోజ్, మంచు విష్ణు పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కొన్నాళ్లుగా అన్నదమ్ములిద్దరికీ పడడం లేదనే విషయం తెలిసిందే.
మనోజ్, మౌనికకి మొదటి సంతానం ఈ పాప దేవసేన. మౌనికకి మొదటి పెళ్లి ద్వారా ఒక బాబు ఉన్నాడు.