ప్రభాస్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. దాదాపు దశాబ్దకాలంగా నలుగుతున్న వ్యవహారం ఇది. ఇది పిల్ల అంటే అదిగో పెళ్లి అన్నట్టు తయారైంది పరిస్థితి. అయితే ప్రతి ఏటా తన పెళ్లిని వాయిదా వేస్తూనే ఉన్నాడు ప్రభాస్. 44 ఏళ్ల ప్రభాస్ పెళ్లిపై జనం కూడా ఆసక్తి చూపించడం తగ్గించేశారు.
సరిగ్గా ఇదే టైమ్ లో మరోసారి ప్రభాస్ పెళ్లి మేటర్ తెరపైకొచ్చింది. ఈసారి అతడి పెద్దమ్మ శ్యామలాదేవి, ప్రభాస్ పెళ్లిపై మాట్లాడారు. త్వరలోనే అతడి పెళ్లి జరుగుతుందనేది ఆమె మాట.
“ప్రపంచవ్యాప్తంగా కల్కి సంబరాలు జరుపుకుంటున్నాం కదా. త్వరలోనే ప్రభాస్ పెళ్లి సంబరాలు కూడా జరుపుకుంటాం. అయితే అన్ని ఆనందాలు ఒకేసారి ఉండకూడదు. ఒకదాని తర్వాత ఒకటి సెలబ్రేట్ చేసుకుందాం. ముందు కల్కి ఆనందం.. ఆ తర్వాత ప్రభాస్ పెళ్లి. ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచనని అన్నాడు. కాబట్టి ఆ బిజీ కాస్త తగ్గిన తర్వాత పెళ్లి.”
శ్యామలాదేవి ప్రకటనతో 2 అంశాలపై క్లారిటీ వచ్చింది. వీటిలో ఒకటి ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడు. రెండోది, అతడు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాడు.