రాజ్ తరుణ్ ఒకప్పుడు చిన్న చిత్రాలకు పెద్ద హీరో. వరుసగా హిట్స్ ఇచ్చాడు. కానీ ఈ యువ హీరో ఆ తర్వాత ఎన్నుకున్న కథలు గాడి తప్పాయి. ఆయన కెరీర్ కూడా ట్రాక్ తప్పింది. ఇటీవల నాగార్జున హీరోగా నటించిన “నా సామి రంగ”లో చిన్న పాత్ర పోషించి ఓ మోస్తరు విజయం అందుకున్నాడు.
చాన్నాళ్లకు ఇప్పుడు హీరోగా ఒక మూవీ అఫర్ వచ్చింది. ఈ సినిమా ఈ రోజు ప్రారంభం అయింది.
రాజ్ తరుణ్ హీరోగా కొత్త దర్శకుడు రమేష్ కడుములు దర్శకత్వంలో ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్.
“ఇది క్రైమ్ కామెడీ. స్వామిరారా, అంధధూన్ తరహాలో వుంటుంది. కథ చాలా అద్భుతంగా వుంటుంది. అందరికీ నచ్చుతుంది.క్రైమ్ కామెడీ నా ఫేవరట్ జోనర్,’ అని అన్నారు రాజ్ తరుణ్. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ మళ్ళీ రైట్ ట్రాక్ లోకి వస్తాడా?
ఈ సినిమా కాకుండా “భలే ఉన్నాడే” అనే మరో చిత్రం కూడా సెట్స్ పై ఉంది. ఆ సినిమాకి సంబంధించిన మొదటి పాట లేటెస్ట్ గా విడుదలైంది.