నాని స్పీడ్ గా సినిమాలు చేస్తాడని పేరు. అందుకే, ఒక సినిమా సెట్ పై ఉండగానే మరో రెండు సినిమాలు డిస్కషన్లో నడుస్తుంటాయి. అలా ఉంటుంది ఆయన ప్లాన్. ఒకప్పుడు రవితేజ కూడా అలాగే ఉండేవారు. కానీ రవితేజ జోరు ఇప్పుడు తగ్గింది.
నాని ప్రస్తుతం “సరిపోదా శనివారం” అనే సినిమా షూటింగ్ లో ఉన్నారు. అది ఆగస్టులో విడుదల అవుతుంది. ఆ తర్వాత నాని చెయ్యబోయే సినిమాలు ఇవే.
- దసరా 2
- సుజీత్ డైరెక్షన్లో మూవీ
- ఎల్లమ్మ (బలగం వేణు డైరెక్షన్)
- జైభీమ్ డైరెక్టర్ తో సినిమా
ఇక పెద్ద హీరోలు ఎవరూ ఇలా ఒకేసారి మూడు సినిమాలు లైన్లో ఉంచేందుకు ఇష్టపడరు. కానీ ప్రభాస్ మాత్రం నానిని మించిపోయారు ఈ విషయంలో. ప్రభాస్ నటించిన “కల్కి” త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చెయ్యబోయే చిత్రాలు నాలుగు. అవును మూడు సినిమాలు స్టార్ట్ కాబోతున్నాయి, ఒకటి ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది.
ప్రభాస్ చేస్తున్న చిత్రాలు ఇవే.
- ది రాజా సాబ్ (ఇది ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది)
- సలార్ 2 (త్వరలోనే షూటింగ్ మొదలు)
- హను రాఘవపూడి డైరెక్షన్లో మూవీ
- స్పిరిట్ (సందీప్ వంగ చిత్రం)
ఇలా ప్రభాస్, నాని ఇద్దరూ నాలుగు కొత్త సినిమాలతో తమ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ఈ సినిమాలన్నీ వచ్చే వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది విడుదల అవుతాయి. అంటే 2026 వరకు ప్రభాస్, నాని తమ సినిమాలను ఫిక్స్ చేసుకున్నారు. ఇక కొత్తగా ఎవరైనా వీరితో సినిమా చేయాలంటే 2027, 28 గురించి ఆలోచించాలి.