హీరోల వల్ల సినిమాలు ఆడుతాయి అనేది ఒక భ్రమ అని అంటోంది కృతి సనన్. పెద్ద హీరోలు ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఇన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? ఇది ఆమె అడుగుతున్న ప్రశ్న.
ఆమె ఇలా సడెన్ గా హీరోల గాలి తీయడానికి కారణం ఈ అమ్మడు నటించిన లేడి ఓరియెంటెడ్ డ్రామా “క్రూ” పెద్ద హిట్ కావడమే.
“క్రూ” చిత్రంలో కృతి సనన్, కరీనా కపూర్, టబు నటించారు. ఇందులో హీరోలు లేరు. మగ స్టార్స్ లేకున్నా ఈ ఫిమేల్ స్టార్స్ వల్లే ఆడింది. 100 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఇప్పటికైనా బాలీవుడ్ నిర్మాతలు కథలు, కాన్సెప్ట్ మీద నమ్మకం పెట్టాలి హీరోల మీద కాదు అని ఈ భామ అంటోంది.
కృతి సనన్ కూడా చాలా మసాలా చిత్రాల్లో నటించింది. పెద్ద హీరోల చిత్రాల్లో సగటు మసాలా హీరోయిన్ పాత్రలు పోషించింది. ఐతే అలాంటివి చేస్తాను అలాగే “క్రూ”లాంటి చిత్రాలు చేస్తాను అంటోంది. కానీ హీరోయిన్ల చుట్టూ తిరిగే కథలు నిర్మించేందుకు బాలీవుడ్ నిర్మాతలకు ధైర్యం రావడం లేదు అని వాపోతోంది.