మృణాల్ ఠాకూర్ నటించిన తాజా చిత్రం “ఫ్యామిలీ స్టార్” ఇటీవల విడుదలైంది. ఈ సినిమా పరాజయం పాలైంది. ఇది విజయ్ దేవరకొండకు మరో పెద్ద ఫ్లాప్. విజయ్ కి ఇటీవల వరుస ఫ్లాప్ లు వస్తున్నాయి. ఐతే, ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది అని ఆశపడ్డ భామ ఎవరో కాదు మృణాల్.
విజయ్ దేవరకొండ కన్నా ఎక్కువగా ఆమె ప్రమోషన్ ల్లో పాల్గొంది. తెలుగులో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడింది. ఐతే ఈ సినిమా ఫ్లాప్ అయినా తాను ఈ సినిమా చేసినందుకు పశ్చాత్తాప పడట్లేదు అని చెప్తోంది.
తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఈ సినిమాకి సంబంధించిన బిహిండ్ ది సీన్స్ (BTS) ఫోటోలు పెట్టింది. ఈ సినిమాలో పోషించిన ఇందు పాత్ర తనకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది అన్నట్లుగా రాసుకొంది.
మృణాల్ కి తెలుగులో ఇది మొదటి ఫ్లాప్ కావొచ్చు కానీ ఆమెకి హిందీలో ఇంతకుముందు ఎన్నో అపజయాలు ఉన్నాయి. అంతే కాదు ఆమె తన కెరీర్ తొలి రోజుల్లో ఎక్కువ అవమానాలు చూసింది. అందుకే తెలుగులో ఈ మొదటి ఫ్లాప్ కారణంగా ఎక్కువగా బాధపడట్లేదు.