ఇన్నాళ్లూ రాజ్ తరుణ్, లావణ్య మధ్య జరిగిన ఎఫైర్ గురించే అందరూ చర్చించుకున్నారు. లావణ్య కూడా తమ మధ్య ఉన్న బంధానికి, సాగిన సహజీవనానికి, జరిగిన అబార్షన్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటపెట్టింది.
మరి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా సంగతేంటి? లావణ్య ఆరోపిస్తున్నట్టు వీళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా.. సహజీవనం మొదలుపెట్టారా..? ఇప్పుడు దీనికి సంబంధించి సాలిడ్ ఆధారాలు బయటపడ్డాయి. రాజ్ తరుణ్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.
రాజ్ తరుణ్, మాల్వి ఛాట్ చేసుకున్నట్టు చెబుతున్న కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిలో వాళ్లిద్దరూ ఐ లవ్ యూ చెప్పుకున్నట్టు కొన్ని మెసేజీలు, ఎమోజీలున్నాయి.
ఛాట్స్ ప్రకారం చూసుకుంటే, రాజ్ తరుణ్ కోసం మాల్వీ మల్హోత్రా కోయంబత్తూరులోని మాధవ హోటల్ లో చాలాసార్లు రూమ్స్ బుక్ చేసినట్టుంది. వీళ్లిద్దరూ అక్కడే తరచుగా కలుసుకున్నట్టు తెలుస్తోంది. తాజా ఛాట్స్ ఎవరు లీక్ చేశారు.. అందులో నిజమెంత అనే అంశాల్ని పోలీసులు నిగ్గుతేల్చాల్సి ఉంది.