ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా పేరు ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని “హనుమాన్” సినిమాని నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య తీస్తున్నారు. మరో రెండు వారాల్లో సినిమా విడుదల కానుంది. దాంతో టీం ప్రమోషన్స్ జోరుగా మొదలుపెట్టింది.
తాజాగా ఈ సినిమా నుంచి “రాహి రే” అనే రెండో పాట విడుదలైంది. హీరోయిన్ నభా నటేష్ ఇండియా అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న వైనాన్ని ఈ పాటలో చూపించారు. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటలో నభా నటేష్ సూపర్ కూల్ గా కనిపించింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ క్యాచిగా ఉన్నాయి.
బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రియదర్శి హీరోగా ఇప్పటికే మంచి విజయాలు చూశాడు. మరి నభాతో కలిసి నటిస్తున్న ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందా చూడాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగుంది అనే చెప్పాయి.