నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే ట్విట్టర్ లో వెల్లడించాడు. తెలుగుసినిమా.కామ్ కి తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఏడాది అతని పుట్టిన రోజు (సెప్టెంబర్ 6, 2024) నాడు ఈ సినిమాని ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ విషయంలో మోక్షజ్ఞ తండ్రి నందమూరి బాలకృష్ణ ఓ నిర్ణయం తీసుకున్నారు.
“హనుమాన్” దర్శకుడు ప్రశాంత్ వర్మకి తన కొడుకుని లాంచ్ చేసే బాధ్యత బాలకృష్ణ అప్పగించినట్లు సమాచారం.
తేజ సజ్జాని హీరోగా నిలబెట్టాడు ప్రశాంత్ వర్మ. అందుకే అతని టాలెంట్ పై బాలయ్యకి గురి కుదిరింది. అంతే కాదు, బాలయ్య హోస్ట్ చేసిన “అన్ స్టాపబుల్” (Unstopabble) షోకి యాడ్స్ రూపొందించింది కూడా ప్రశాంత్ వర్మ. అప్పటి నుంచి బాలయ్యకి ప్రశాంత్ టాలెంట్ పై నమ్మకం ఏర్పడింది.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం వేరే సినిమా చేస్తున్నాడు. అది పూర్తి చేసిన తర్వాత ఇది చేస్తాడా? లేక దాన్ని పక్కన పెడుతాడా అనేది చూడాలి.