జనవరి 2న ‘పుష్ప-2’ ఓటీటీ స్ట్రీమింగ్.. జనవరి 9న గ్యారెంటీగా ఓటీటీలోకి ‘పుష్ప-2’.. ఇలా బన్నీ సినిమా స్ట్రీమింగ్ పై రోజుకో ఊహాగానం తెరపైకి వస్తోంది. 2 రోజులుగా ఈ హడావుడి చూసిన మేకర్స్ కు స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.
‘పుష్ప-2’ స్ట్రీమింగ్ పై మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టత ఇచ్చింది. రిలీజ్ డేట్ నుంచి 56 రోజుల్లోపు ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లో ఓటీటీలోకి రాదని ప్రకటించింది. సో.. పండక్కి అంతా ‘పుష్ప-2’ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరింది.
సినిమా స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇచ్చామని మేకర్స్ భావించారు కానీ, పరోక్షంగా స్ట్రీమింగ్ డేట్ ను వాళ్లు వెల్లడించినట్టయింది. రిలీజ్ డేట్ నుంచి 56 రోజులంటే, అది జనవరి 29 అవుతుంది. సో.. జనవరి 29 తర్వాత ఏ క్షణానైనా ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనే క్లారిటీ వచ్చేసింది. అంతెందుకు, జనవరి 29 రాత్రికే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
‘పుష్ప-1’ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా… పార్ట్-2 స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.