సమ్మర్ పోటీ అప్పుడే మొదలైంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ లో తమ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు చాలామంది మేకర్స్ పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయగా.. తాజాగా మరికొంతమంది కూడా అదే పని చేస్తున్నాడు.
మొన్నటికిమొన్న అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న ‘ఘాటీ’ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక తాజాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘జాక్’ సినిమాను కూడా ఏప్రిల్ 10కి విడుదల చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు.
ఈ రెండు సినిమాల కంటే ముందు చాలా మూవీస్, ఏప్రిల్ నెలలో షెడ్యూల్ అయి ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే ఆ సినిమా చెప్పిన తేదీకి వచ్చేలా లేదు, అందుకే ‘జాక్’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఇక తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయి’ సినిమాను ఏప్రిల్ 18న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అటు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ సినిమా కూడా ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది.
ప్రస్తుతానికి ఏప్రిల్ నెలలో షెడ్యూల్ అయిన సినిమాలివే. ఇందులోంచి కొన్ని వైదొలగొచ్చు, మరికొన్ని కొత్త సినిమాలు యాడ్ అవ్వొచ్చు. మరో నెల రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది.