హీరోయిన్ రాధిక ఆప్టేకి ఇటీవలే కూతురు పుట్టింది. కూతురు పుట్టిన వారానికే తాను పనిలో పడ్డాను బేబీకి పాలు ఇస్తూ ముందు ల్యాప్ టాప్ పెట్టుకొని పనిచేస్తున్న ఫోటోని ఐదు రోజుల క్రితం షేర్ చేసింది. ఇక తాజాగా తన డెలివరీకి సరిగ్గా వారం రోజుల క్రితం ఆమె తన నిండు గర్భంతో ఫొటోషూట్ చేసింది.
ఒక మేగజైన్ కోసం ఆ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను ఇప్పుడు డెలివరీ తరవాత షేర్ చేసింది. గర్భిణిగా తన అనుభూతులను ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది.
గర్భం దాల్చినప్పుడు ఎవరైనా ఆనందపడతారని, తను మాత్రం షాక్ అయ్యానని వెల్లడించింది. తనకు పాజిటివ్ అని తెలిసిన తర్వాత కొన్ని క్షణాల పాటు షాక్ అయ్యానని, అది అనుకోకుండా అలా జరిగిపోయిందని వెల్లడించింది.
నిండు గర్భిణిగా తనని తాను అద్దంలో చూసుకోలేకపోయాను అని, బాగా లావుగా కనిపించాను అని తెలిపింది రాధిక ఆప్టే. ఐతే ఇదంతా ప్రకృతి సహజం కాబట్టి బాధపడలేదు అని చెప్పింది.
అయితే ఆమె ఫోటోషూట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరీ శృతిమించినట్లు ఆ ఫోటోషూట్ ఉందని కామెంట్స్ పడుతున్నాయి.
రాధికా ఆప్టే, బ్రిటన్ కి చెందిన బెనడిక్ట్ టేలర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఏడాది లండన్ లో వీళ్లు కలుసుకున్నారు. కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. 2013లో వీళ్లు తమ పెళ్లి మేటర్ ను బయటపెట్టారు. పెళ్లి అయిన 12 ఏళ్లకు ఆమెకి మొదటి బిడ్డ కలిగింది.