నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గ్రాండ్ గా జరుగుతుందని భావించారు. కానీ ముహూర్తం షాట్ నుంచే విఘ్నాలు మొదలయ్యాయి. గ్రాండ్ గా డేట్ ఇచ్చి, క్లాప్ కూడా కొట్టకుండా కామ్ అయ్యారు. దీంతో ఒకటే అనుమానం, ఎన్నో పుకార్లు..
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్ష్ హీరోగా రావాల్సిన సినిమా ఆగిపోయిందంటూ చాలా ప్రచారం జరిగింది. అది కూడా ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే. ఆ వెంటనే ఆ పుకార్లను ఖండించి ఉంటే బాగుండేది.
కానీ తాపీగా ఇప్పుడు ఖండన ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ, మోక్ష్ సినిమాపై వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ ఎస్ఎల్వీ సినిమాస్ నుంచి ప్రకటన వచ్చింది. ఏదైనా ఉంటే తామే ప్రకటిస్తామని కూడా అందులో చెప్పుకున్నారు.
ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఖండించడం ఏంటి? దాని బదులు మళ్లీ ఎప్పుడు క్లాప్ కొడతారో చెబితే సరిపోయేది కదా. ఒకవేళ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వనప్పుడు, హీరోయిన్ లేదా వేరే స్టార్ ఎవరున్నారో అప్ డేట్ ఇచ్చినా సరిపోయేది. ఇన్నాళ్లు తర్వాత తీరిగ్గా ఖండించడం ఏంటో!